ప్రేమ అంటే ఏంటో తెలుసా ? ఇస్తే మళ్ళీ తిరిగి తీసుకోవాలి
on Mar 19, 2025
అఖిల్ సార్థక్ గురించి ఎవరు అడిగినా ఇట్టే చెప్పేస్తారు. అలాంటి అఖిల్ సార్థక్ బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా వెళ్ళాడు. ఆ సీజన్ లో రన్నర్ గా నిలిచాడు. అలాంటి అఖిల్ బిగ్ బాస్ తర్వాత అసలు బుల్లితెర కనిపించడమే లేదు. ఇన్స్టాగ్రామ్ పేజీలో తన అప్డేట్స్ పెడుతూ ఉంటాడు. ఐతే రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టాడు అఖిల్. అదేంటంటే "ప్రేమ అంటే ఏమిటి ? " అంటూ ఒక కాప్షన్ ని తన రీల్ లో పోస్ట్ చేసాడు. అలాగే పక్కనే ఇంకో పోస్ట్ కూడా పెట్టాడు. "
నువ్వు ఎప్పుడూ ప్రేమ గురించే ఎందుకు మాట్లాడుతున్నావని ప్రజలు నన్ను అడుగుతున్నారు. కనీసం దాని గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు సంతోషంగా అనిపిస్తుంది. నిజమైన ప్రేమ మీ కష్ట సమయాల్లో నిన్ను తెలుసుకుంటుంది. కానీ మనం దానికి విలువ ఇవ్వం. ప్రేమ సరైన సమయంలో దొరకదు..అలాగే మనం సరైన సమయంలో తప్పుడు వ్యక్తులను, రాంగ్ టైములో సరైన వ్యక్తులను ఎన్నుకుంటూ ఉంటాం.." అంటూ ఒక వేదాంతం చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్ కి సయ్యద్ సోహైల్ కామెంట్ చేసాడు. "ఏ ఊర్కో భయ్యా రిటర్న్ ఇవ్వకపోతే నువ్వే ప్రేమించేసి...నువ్వే ప్రేమ చూపించి నువ్వే వెంటపడుతున్నప్పుడు నీ మీద ప్రేమ ఎవరు చూపించకపోతే ఇంకా అదేం ప్రేమ..? మన పుట్టుక అమ్మ ప్రేమతో నాన్న బాధ్యతలతో పెరిగాం, అలాంటి ప్రేమ అట్లీస్ట్ అందులో 50% ప్రేమ అమ్మాయి నుండి లేదా అబ్బాయి నుండి కూగా అందకపోతే ఇంకెందుకు బ్రో లవ్ చేసి... మనం కూడా తిరిగి ఆశించాలి. ఎందుకంటే మనకు ఎన్ని సమస్యలు ఉన్నా మన పక్కన లైఫ్ పార్టనర్ ఉంటె అన్నీ మార్చిపోవాలి అప్పుడే ప్రేమకి నిర్వచనం ఉంటుంది. అండ్ హ్యాపీగా ఉంటాం, నాక్కూడా హ్యాపీనెస్ కావాలి రిటర్న్ లో, లేకపోతే చల్ లవ్ లేదు తొక్కలేదు, సింగిల్ లైఫ్ బెటర్.. " అంటూ రిప్లయ్ ఇచ్చాడు. ఏదేమైనా ప్రేమ ఇస్తే తిరిగి ఆశించాలి అన్నదే ఇక్కడ తెలుస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
